IHG

బిల్ కలెక్టర్లు నల్లబ్యాడ్జీలు ధరించి  తాండూరు మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.  తాండూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ అనిల్‌కుమార్‌, బిల్‌ కలెక్టర్‌ నాగేందర్‌ను అకారణంగా దూషించారని ఆరోపిస్తూ బుధవారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట బిల్‌ కలెక్టర్లు, ఇతర ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి కార్యాలయం ముందు భైఠాయించారు.

 

ఈ సందర్భంగా  కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డి అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బిల్‌ కలెక్టర్‌ నాగేందర్ జరిగిన విషయాన్నీ ఆయనకు వివరించారు. ఇదిలా ఉండగా  సీనియర్‌ అసిస్టెంట్‌ అనిల్‌కుమార్‌ మాత్రం బిల్లు లను వాసులు చేయాలి అన్నందుకే తనపై వాదనకు దిగారని వివరించారు.  కిందిస్థాయి సిబ్బంది, సీనియర్‌ అసిస్టెంట్‌ లను చులకనగా చూస్తున్నారని బిల్‌ కలెక్టర్లు ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: