టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలతో సక్సెస్ సొంతం చేసుకున్న ఈ హీరోయిన్ ట్విట్టర్ ద్వారా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయినట్టు పేర్కొంది. తన ఖాతా నుంచి వచ్చే సమాచారాన్ని నమ్మవద్దని సమస్య పరిష్కారం అయ్యేవరకు వ్యక్తిగతంగా ఎటువంటి సమాచారాన్ని పంపించవద్దని కోరింది. 
 
తన డిజిటల్ బృందం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తోందని తెలిపింది. సమస్య పరిష్కారం అయిన తరువాత తానే స్వయంగా తెలియజేస్తానని పేర్కొంది. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్ల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అనేక మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ కావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: