దేశంలో లాక్ డౌన్ ప్రకటించడంతో అనేక యాజమాన్యాలు వలస కార్మికులను నడి రోడ్డుపై వదిలేస్తున్నాయి. అయితే తాజాగా ఢిల్లీకి చెందిన ఓ రైతు వలస కార్మికుల పట్ల తన గొప్ప హృదయాన్ని చాటుకున్నాడు. బీహార్ లోని సొంతూళ్లకు ఎలా వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటున్న వలస కార్మికులకు ఒక రైతు విమాన టికెట్లను బుక్ చేశాడు. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఢిల్లి నుంచి పాట్నాకు వెళ్లే విమానం బయలుదేరనుంది. 
 
మొదట వలస కార్మికులు ఏప్రిల నెలలోనే ఇళ్లకు వెళ్లాలని భావించినా కుదరలేదు. సమస్తిపూర్ జిల్లాలోని తమ స్వగ్రామాలకు ఇంత సులభంగా విమానంలో వెళ్తామని ఊహించలేదని వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వస్థలాలకు కాలినడకనో, సైకిళ్ల మీదో లేదా బస్సులు, రైళ్లలో సీట్ల కోసం తిప్పలుపడుతూనో వెళ్తామని అనుకున్నామని.... విమానంలో వెళ్తామని కలలో కూడా ఊహించలేదని వారు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: