అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ మోత మోగించింది. ఈ సినిమా రిలీజ్ కి ముందే లిరికాల్ సాంగ్స్ ని రిలీజ్ చేయగా గొప్ప ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి అయితే సినిమా రిలీజ్ అయిన తరువాత కూడా ఈ సినిమాకి సంబందించిన సాంగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. మొన్న నిన్నటివరకు యూట్యూబ్ లో క్రేజ్ ని క్రియేట్ చేసిన బుట్ట బొమ్మ సాంగ్ కోసం శిల్ప శెట్టి , డేవిడ్ వార్నర్ వంటి పలువురు ప్రముఖులు ఈ పాటకు టిక్ టాక్ వీడియో లు తయారుచేసి ఆ పాటపై ఇంకాస్త హైప్ ని క్రియేట్ చేసారు.

 

తాజాగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్సినిమా కి సంబందించిన ముఖ్యమైన అప్డేట్ ని పంచుకున్నాడు. అయితే గ్లోబల్ వైడ్ గా ఈ సాంగ్ రికార్డు క్రియేట్ చేసింది. యూట్యూబేలో 195,818,128 వ్యూస్ తో గ్లోబల్ వైడ్ గా 15 వ స్థానాన్ని సాధించింది. అయితే ఈ సందర్భంగా ఈ రోకార్డ్ కి కారణం అయినా దర్శకుడు త్రివిక్రమ్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కృతజ్ఞతలు తెలియజేసాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: