యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్(యూజీసీ) 127 సంస్థలకు భారీ షాక్ ఇచ్చింది. యూజీసీ చట్టం, సుప్రీం కోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని 127 సంస్థలకు విశ్వవిద్యాలయం అనే పదం ఉపయోగించకూడదని ఆదేశాలు జారీ చేసింది. నిన్న విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం విశ్వవిద్యాలయాలుగా పరిగణించబడే హోదా ఇచ్చిన ప్రతి సంస్థ విశ్వవిద్యాలయం అనే పదాన్ని ఉపయోగిస్తోందని ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. 
 
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యూజీసీ హెచ్చరించింది. 1956 సంవత్సరం సెక్షన్ 23 ప్రకారం విశ్వవిద్యాలయం అనే పదాన్ని ఉపయోగించడానికి అందరికీ వీలు లేదని పేర్కొంది. సెంట్రల్ యాక్ట్, స్టేట్ యాక్ట్, ప్రావిన్షియల్ యాక్ట్ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని మాత్రమే విశ్వవిద్యాలయాలుగా పరిగణిస్తామని యూజీసీ పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

ugc