ఉత్తరాది రాష్ట్రాలను మిడతల దండు బాగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే వాటిని ఎదుర్కోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అవసరమైన యంత్రాలను ఇస్తుంది. ఈ నేపధ్యంలోనే రాజస్థాన్ లోని జైపూర్ జిల్లాలోని చామూలో బుధవారం కేంద్రం ఇచ్చిన డ్రోన్ ని వినియోగించారు. 

 

పెద్ద సౌండ్ చేయడమే కాకుండా పురుగు మందులను అది పిచికారి చేస్తుంది. ఈ రోజు నుంచి తాము డ్రోన్ ని వినియోగించడం మొదలుపెట్టామని అధికారులు పేర్కొన్నారు. ఎత్తైన ప్రాంతాల్లో డ్రోన్ లు చాలా బాగా ఉపయోగపడతాయని అధికారులు అంటున్నారు. వచ్చే వారం రోజులు వాటిని వినియోగిస్తామని చెప్తున్నారు. డ్రోన్ 15 నిమిషాల సమయంలో దాదాపు 2.5 ఎకరాల విస్తీర్ణంలో పురుగుమందును చల్లుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: