హర్యానాలోని గుర్గావ్ నుంచి బీహార్ లోని దర్బంగా వరకు దాదాపు 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కి తన తండ్రిని సొంత గ్రామానికి తీసుకుని వెళ్ళిన జ్యోతి అనే అమ్మాయికి ఇప్పుడు ఉచిత విద్యను అందించడానికి గానూ పలువురు సిద్దమవుతున్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే తాజాగా ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు మరియు సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ జ్యోతి కుమారికి ఉచిత ఐఐటి-జెఇ ప్రవేశ పరీక్ష కోచింగ్‌ను అందించడానికి సిద్దమయ్యారు. తన తమ్ముడు తో కలిసి ఆయన జ్యోతిని కుటుంబాన్ని కలిసారు. భవిష్యత్తులో ఆమె ఐఐటికి సిద్దం కావాలి అనుకుంటే సూపర్ 30 స్వాగతం పలుకుతుంది అని ఆయన సోషల్ మీడియాలో కామెంట్ చేసారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి దిగిన ఫోటో ని పోస్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: