దేశంలో కరోనా విజృంభణతో లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే నాలుగో విడత లాక్ డౌన్ ఈ నెల 31వ తేదీతో ముగియనుండటంతో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మే 31వ తేదీ తరువాత హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్. థియేటర్లు ఓపెన్ చేయడానికి కర్ణాటక సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
కేంద్రానికి ఇప్పటికే రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, థియేటర్లు ఓపెన్ చేయడానికి అనుమతులు అడిగానని కేంద్రం నుంచి పాజిటివ్ రిప్లై వస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. జనం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడం ప్రారంభించారని వారిని దృష్టిలో ఉంచుకుని హోటళ్లు, రెస్టారెంట్లకు, లాడ్జీలకు అనుమతులు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. కేంద్రం యడ్యూరప్ప లేఖ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: