ఎట్టకేలకు తబ్లిఘీ జమాత్ సభ్యులపై చార్జ్ షీట్ దాఖలు చేసారు. దేశ రాజధాని నిజాముద్దీన్ ప్రాంతంలోని మార్కాజ్ తబ్లిఘి జమాత్‌లోని సమాజానికి సంబంధించి 14 దేశాల 292 మంది విదేశీ పౌరులపై సాకేత్ జిల్లా కోర్టులో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బుధవారం మరో 15 చార్జిషీట్లు దాఖలు చేసారు. 

 

మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జితేంద్ర ప్రతాప్ సింగ్ కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేసారు. తబ్లిఘీ జమాత్ కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి. సుమారుగా 13 వేల పేజీల చార్జ్ షీట్లను దాఖలు చేసారు. జూన్ 17న వాటిని పరిశీలిస్తారు. సెక్షన్ 14 (బి) విదేశీయుల చట్టం, 1946, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్, 1897 లోని సెక్షన్ 3, విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని సెక్షన్ 51 మరియు సెక్షన్లు 188 వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: