లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు సినిమాలు విడుదల అయ్యే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. చాలా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నా విడుదల అయ్యే పరిస్థితి లేదు అనే చెప్పాలి. ఇక కొన్ని సినిమాల షూటింగ్ లు కూడా ఆగిపోయాయి. స్టార్ హీరోల సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు ఎప్పుడు విడుదల అవుతాయా అనే పరిస్థితి దాదాపుగా ఉంది అని చెప్పవచ్చు.
ఇక అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ నటిస్తున్న కపటదారి అనే సినిమా షూటింగ్ పూర్తి అయిందని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి అవుతుందని సుమంత్ స్వయంగా పోస్ట్ చేసాడు. సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది మాత్రం సుమంత్ చెప్పలేదు తన ట్వీట్ లో.
From #Kapatadhaari. Shoot done, thankfully just before the lockdown, and currently in post production. #ComingSoon pic.twitter.com/52a9AD3LPu
— Sumanth (@iSumanth) May 27, 2020