దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ నుంచి వృద్దులు కోలుకోవడం అనేది చాలా కష్టంగా మారింది. 60 ఏళ్ళు పైబడిన వారికి కరోనా వస్తే కష్టమే అనే అభిప్రాయాలు ప్రపంచ వ్యాప్తంగా కూడా వినపడుతున్నాయి. ఇక ఈ తరుణంలో కొందరు వృద్దులు కరోనా వైరస్ ని జయించి బయటకు వస్తున్నారు. 

 

తాజాగా మధ్యప్రదేశ్ లో ఒక వృద్దుడు కరోనా వైరస్ ని జయించాడు. 90 ఏళ్ళ వ్యక్తి కరోనా వైరస్ ని జయించి బయటకు రావడంతో అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. ఇక ఆయన బయటకు రాగానే ఒక చిన్నారి హారతి కూడా ఇచ్చింది. ఈ సందర్భంగా తీసిన ఫొటో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: