తెలంగాణాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా సరే పెద్దగా ఫలితం మాత్రం కనపడటం లేదు అనే చెప్పాలి. నిన్న ఒక్క రోజే తెలంగాణాలో 107 కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం కూడా జాగ్రత్త పడుతుంది. 

 

అనవసరంగా లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నామా అనే ఆందోళన ప్రభుత్వంలో కూడా వ్యక్తమవుతుంది. కేసులు పెరగడానికి ఇదే ప్రధాన కారణం అనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. అందుకే ఇప్పుడు తెలంగాణా సర్కార్ జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో సడలింపు ల విషయంలో వెనక్కు తగ్గితే మంచిది అనే అభిప్రాయం కేసీఆర్ సహా కీలక మంత్రులు అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: