తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోలు అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు మాత్రమే గుర్తుకు వచ్చేవారు. కళామతల్లికి ఈ ఇద్దరు రెండు కళ్లు అని చెప్పుకునేవారు.  తెలుగు చిత్ర పరిశ్రమ ఈ స్థాయిలో ఉండటానికి ఆ గొప్ప నటులు వేసిన పునాది అని చెప్పుకుంటారు.  సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో ఆయన వేయని పాత్ర అంటూ లేదు.. ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోశారు ఎన్టీఆర్.  రాముడు, కృష్ణుడు మాత్రమే కాదు.. రావణాసురుడు అంటే ఇలా ఉంటారా అన్న విధంగా ఆయన చిత్రాలు ఉండేవి. అప్పట్లో మల్టీస్టారర్ చిత్రాలు బాగానే వచ్చేవి..ఎన్టీఆర్ తో కలిసి నటిస్తే అది సూపర్ హిట్టే అనేవారు.  ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.

IHG

నేడు ఆయన 97వ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తాను ఎన్టీఆర్ తో గడిపిన మధుర క్షణాలు గుర్తుకు చేసుకున్నారు.  ఈ సందర్బంగా  తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "తెలుగు జాతి  పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల  గుండెల్లో  ఎన్నటికీ  చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ.." అని వ్యాఖ్యానించారు. ఇక ఎన్టీఆర్, చిరంజీవి 'తిరుగులేని మనిషి' అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో 'యవ్వనం... ఒక నందనం' అంటూ సాగా పాట ఎంతో పాపులారిటీ సంపాదించింది.  

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: