ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తూనే ఉంది. రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి గాని ఎక్కడా కూడా తగ్గే అవకాశాలు దాదాపుగా లేవు. ఇక పలు దేశాలు సినిమాల షూటింగ్ లకు అనుమతులు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపధ్యంలో కొన్ని మార్గదర్శకాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 

 

మన దేశంలో ఇక కొన్నేళ్ళ పాటు లిప్ లాక్ సీన్ లు, ఆలింగనం లేకుండానే సినిమాల షూటింగ్ చేసే అవకాశం ఉంది. అలాగే నటులు అందరూ కూడా ఒక చోట ఉండే సన్నివేశాలను కూడా వద్దని కేంద్రం భావిస్తుంది. సీరియల్స్ కి కూడా ఇదే విషయాన్ని చెప్పే సూచనలు ఉన్నాయని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా జూన్ నుంచి సినిమా షూటింగ్ లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: