ఇటీవల సినీ పెద్దలు కొందరితో సినిమా షూటింగులు ప్రారంభించే విషయంపై ప్రభుత్వం జరుపుతున్న చర్చలు తనకు తెలియదని హీరో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వంతో చర్చల విషయం పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి తెలుసుకున్నా అని బాలయ్య చెప్పారు. జూన్‌లో షూటింగులు ప్రారంభమవుతాయని అనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. షూటింగ్‌ల కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు.

 

ఎక్కువ శాతం షూటింగ్‌లు ప్రారంభమైన చిత్రాలకు త్వరగా అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు. అదే విధంగా షూటింగ్‌ సమయంలో సామాజిక దూరం పాటించాలని, గతంలో మాదిరిగా సినిమా షూటింగ్ లు ఉండే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: