అమెరికాలో నల్ల జాతీయుడి పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. అమెరికాలోని మిన్నియా పోలీసులులకు సెక్యూరిటీ గార్డ్ గా పని చేసే జార్జ్‌ ఫ్లైడ్‌పై ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ వ్యక్తిని కింద పడేసి చేతులకు సంకెళ్లు వేశారు. ఒక పోలీస్ అధికారి విచక్షణ కోల్పోయి జార్జ్‌ గొంతుపై మోకాలితో బలంగా నొక్కిపెట్టాడు. జార్జ్ పోలీసులను తనను హింసించొద్దని ఎంత ప్రాధేయపడినా వారు అతని మాటను లెక్క చేయలేదు. 
 
కొంత సమయం తరువాత జార్జ్ లో ఎలాంటి చలనం లేకపోవడంతో పోలీసులు పరిశీలించగా జార్జ్ చనిపోయినట్లు గుర్తించారు. పోలీస్ అధికారి గొంతు నొక్కిపెట్టిన సమయంలో ఊపిరాడక జార్జ్ మృతి చెందాడు. శ్వేత, నల్లజాతీయులు ఈ అమానుషాన్ని ఖండిస్తూ నిరసన తెలియజేశారు. జార్జ్ మృతికి కారణమైన పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. మేయర్‌ జాకబ్‌ ఫ్రే ఈ ఘటన గురించి స్పందిస్తూ దాడి చేసిన పోలీసులను విధుల నుంచి తొలగిస్తున్నామని... ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశిస్తున్నామని తెలిపారు. 


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: