జమ్మూకాశ్మీర్ లో పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే పుల్వామా ని కేంద్రంగా చేసుకొని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. గత ఏడాది నుంచి పలుమార్లు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.. కారు బాంబు తో జవాన్లను పొట్టన బెట్టుకున్నారు.  అందుకు ధీటుగా ఉగ్రవాదులకు బారత సైన్యం సరైన బుద్ది చెప్పింది. అయినా ఈ మూర్ఖులు తీరు మార్చుకోకుండా పదే పదే దాడులకు పాల్పపడుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భారీ ఉగ్రదాడికి ప్రయత్నం జరిగింది. అయితే, ఉగ్ర కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశారు. ఈ కుట్రలో లష్కరే, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాహనంలో ఐఈడీ బాంబులు అమర్చి దాడి చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు తేలింది.

 

దాదాపు 20 కిలోల ఐఈడీతో ఓ కారులో ఈ రోజు ఉదయం ఉగ్రవాది వెళ్తుండగా భద్రతా బలగాలు ఆ కారును ఆపి సోదాలు చేయాలనుకున్నారు. అంతలోనే డ్రైవింగ్ చేస్తున్న ఉగ్రవాది.. బారికేడ్లపైకి దూసుకెళ్లి కారుతో పాటు పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. దీంతో కారును అక్కడే వదిలేసి ఉగ్రవాది పారిపోయాడు.  ఉగ్రదాడి జరిగే అవకాశముందని అంతకు ముందే భద్రతా బలగాలకు నిఘా వర్గాల నుంచి హెచ్చరిక వచ్చింది.ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కారులోని పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు. అయితే, ఆ సమయంలో పేలుడు సంభవించి కొద్దిగా నష్టంవాటిల్లింది. పస్తుతం ఉగ్రవాది కోసం ఆర్మీ, పోలీసు సిబ్బంది సోదాలు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: