ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులకు సంబంధించి వివరణ ఇవ్వడానికి గానూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని నేడు కోర్ట్ కి హాజరయ్యారు. ఆమె తో పాటుగా పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ కమీషనర్ గిరిజ శంకర్ కూడా వచ్చారు. 

 

సుప్రీం, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం 623 జీవో ను జారీ చేయడాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఎందుకు పరిగణించ కూడదో వివరణ ఇవ్వాలని రాష్ట్ర సిఎస్ ను హైకోర్ట్ ఆదేశించింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ని ప్రారంభించాలని ఇప్పటికే రిజిస్ట్రార్ ని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఇక  ఈ కేసుని రేపటికి విచారణ వాయిదా వేసారు. సుప్రీం కోర్ట్ లో ఇదే అంశంపై స్పెషల్ లీవ్ పిటీషన్ ని దాఖలు చేయగా సుప్రీం కోర్ట్ ఆదేశాల ఆధారంగా రేపు విచారణ చేపడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: