ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోయంబేడు లింకు లు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఏపీలో అదుపులోకి వచ్చింది అనుకున్న కరోనా వైరస్ ఈ లింకు ల కారణంగా మరింత వేగంగా విస్తరించడం ఆందోళన కలిగిస్తుంది. దాదాపు నాలుగు జిల్లాల్లో కరోనా కేసులు వేగంగా పెరగడానికి ఈ కోయంబేడు మార్కెట్ లింకులు అని అధికారులు గుర్తిచారు. 

 

ప్రస్తుతం ఇంకా కేసులు దీని కారణంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కఠిన  నిర్ణయాల దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇక చెన్నై నుంచి చిత్తూరు సరిహద్దుల్లో ఎవరిని కూడా రాష్ట్రంలోకి రానీయకుండా  జాగ్రత్తలు పడుతున్నారు. ఇక ఎన్ని కేసులు వీటి నుంచి నమోదు అవుతాయి అనేది చూడాలి. నేడు నమోదు అయిన కేసుల్లో 8 వాటికి ఆ లింకులే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: