IHG's non-stop gyming

మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియా ద్వారా తన పిల్లల ఫోటో లను లేదా వీడియో లను షేర్ చేస్తూ ఉంటుంది. మహేష్ తన ఖాళీ సమయాన్ని తన పిల్లలతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.నమ్రత మటుకు మహేష్ బాబు కి సంబందించిన లేటెస్ట్ అప్డేట్ లను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. అయితే మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. మహేష్ తాను స్లిమ్ గా ఉండడానికి కారణం అతను తీసుకొనే పౌష్ఠిక ఆహారమే అని చెప్పింది .ఐతే మహేష్ ఫుడ్ విషయంలో చాలా జాగర్తగా ఉంటాడు.

 

 

రోజు 6  లేక 7 గంటలకల్లా తన భోజనాన్ని పూర్తి చేసుకుంటాడు. ఫిట్నెస్ కోసం రోజు వర్కౌట్స్ చేస్తూ ఉంటాడు. అయితే తాజాగా నమ్రత రిలీజ్ చేసిన మహేష్ బాబు కి సంబందించిన వీడియో వైరల్ అయ్యింది. అందులో మహేష్ ట్రెడ్‌మిల్‌పై తన వ్యాయామం చేస్తున్నట్లు కనిపించింది. ఇదిలా ఉండగా బుధవారం మహేష్ బాబు కొత్త సినిమాకి సంబంధించి న టైటిల్ ను సర్కార్ వారి పాట గా కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రానికి గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మూసీకి డైరెక్టర్ ని ఇంకా ఖరారు చేయలేదు

మరింత సమాచారం తెలుసుకోండి: