కడప జిల్లాలో 15 వేల కోట్ల తో స్టీల్ ప్లాంట్ ని స్థాపిస్తామని సిఎం జగన్ అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం పని చేయడానికి కంపెనీలు వస్తే వారితో కలిసి పని చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని సిఎం వైఎస్ జగన్ స్పష్టం స్పష్టం చేసారు. ఇక బెంగళూరు లాంటి నగరాలతో పోటీ పడే సత్తా విశాఖ నగరానికి ఉందని అన్నారు. 

 

స్టీల్ ప్లాంట్  అందుబాటులోకి వస్తే రాయలసీమ దశ దిశ మారిపోతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేసారు. కాగా నాడు వైఎస్  కూడా కడప జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఏపీలో పెట్టుబడి పెట్టడానికి గానూ 23 కంపెనీలు సిద్దంగా ఉన్నాయని సిఎం అన్నారు. వాళ్ళు భారీగా పెట్టుబడులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: