ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్లాట్‌ఫామ్‌పై సెల్లర్లకు ఉచిత ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తోంది. సెల్లర్లు ఇందుకోసం ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. కరోనాతో ఆస్పత్రిలో చేరే వారికి అయ్యే ఖర్చులు, అంబులెన్స్ వ్యయాలు, ఐసీయూ చార్జీలు అన్నీ పాలసీలో కవర్ కానున్నాయి. కరోనా పాలసీ అమెజాన్ సెల్లర్లకు సంవత్సరం పాటు అందుబాటులో ఉంటుంది. 
 
అకో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో సెల్లర్లకు ప్రయోజనం కలిగించేందుకు అమెజాన్ జతకట్టింది. పాలసీ క్లెయిమ్, రీయింబర్స్‌మెంట్ లాంటివన్నీ ఈ ఇన్సూరెన్స్ సంస్థనే చూసుకోనుంది. లక్షల సంఖ్యలో విక్రేతలకు అమెజాన్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయోజనం కలగనుందని తెలుస్తోంది. సెల్లర్లకు ప్రయోజనం కలగానే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. కరోనా విజృంభణతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: