మెదక్ జిల్లాలో ఒక బోరు బావిలో పడి చిన్నారి మృతి చెందిన ఘటనపై బాలల హక్కుల సంఘం మానవ హక్కుల కమీషన్ కి ఫిర్యాదు చేసింది. ఘటనకు రెవెన్యూ శాఖ అధికారులను బాధ్యులను చేయాలని కోరింది. బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని, అధికారులు కేవలం డబ్బు కక్కుర్తితో ఎక్కడ పడితే అక్కడ అనుమతులిచ్చి ఆ బోరు విఫలమైతే దానిని వెంటనే  మూసి వేయడానికి చర్యలు చేపట్టడం లేదని మండిపడింది. 

 

అధికారుల నిర్లక్ష్యంతో పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మెదక్ జిల్లాలో జరిగిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పిటీషన్ లో కోరింది. ఘటనలో మృతి చెందిన బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరిన బాలల హక్కుల సంఘం పదిలక్షల రూపాయల పరిహారం చెల్లించాలని పిటీషన్ లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: