టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఆస్తులను అమ్మకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. భక్తులు ఇచ్చిన కానుకలను, ఆస్తులను విక్రయించవద్దు అని తీర్మానం చేసారు.  ఇక ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

గతంలో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు బురద జల్లారని ఆయన పేర్కొన్నారు. ఈ కుట్ర పై సమగ్ర విచారణ చేస్తామని అన్నారు. టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతం అవ్వకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇందుకు ఒక కమిటీ ని ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటిలో పాలక మండలి సభ్యులతో పాటుగా పీఠాదిపతులు భక్తులు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. డొనేషన్ ల విధానంలో భక్తులకు అతిథి గృహాలను కేటాయిస్తామని చెప్పారు. లాక్ డౌన్ నిభందనలు ముగిసాక భక్తులను అనుమతి ఇస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: