తెలంగాణా సరిహద్దున ఉన్న మహారాష్ట్రలో మిడతల దండు ప్రవేశించిన నేపధ్యంలో  తెలంగాణా సర్కార్ అప్రమత్తమైంది. తెలంగాణాలో మిడతల దండు ప్రవేశిస్తే ఎం చెయ్యాలి అనే దాని మీద కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేసారు.  మిడతలు ఎక్కడ అయినా కనపడితే ఫోన్ చెయ్యాలని తెలంగాణా సర్కార్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఇచ్చింది. 

 

ప్రస్తుతం తెలంగాణా కు 400 కిలోమీటర్ల దూరంలో మిడతల దండు ఉంది. ఇవి నిజామాబాద్ నిర్మల్ భూపాలపల్లి, మెదక్ అదిలాబాద్ సరిహద్దుల నుంచి రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీనితో కేసీఆర్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసారు. కేంద్రం సహకారం తీసుకోవాలని కూడా ఆయన సూచనలు చేసారు దీనితో అధికారులు కూడా సిద్దమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: