తెలంగాణాలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గత వారం రోజులుగా తీవ్రంగా ఎండలు ఉన్న నేపధ్యంలో ఇప్పుడు ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో కాస్త వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

 

ఇక తెలంగాణాలోని దాదాపు అన్ని జిల్లాల్లో కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. అన్ని జిల్లాల్లో కూడా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉన్నాయి ఇప్పుడు. దీనితో ప్రజలు ఎవరూ కూడా అవసరం ఉంటే మినహా బయటకు రావాడ౦ లేదు. అటు దేశ వ్యాప్తంగా కూడా ఎండలు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో తాగునీటి కొరత కూడా తీవ్రంగా ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: