దేశ వ్యాప్తంగా క్రమంగా లాక్ డౌన్ ని కేంద్ర ప్రభుత్వం ఎత్తేస్తుంది. అయితే కేసులు ఉన్న ప్రాంతాల్లో మాత్రం చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ వస్తుంది. అయితే లాక్ డౌన్ లేకపోతే దేశంలో నేరాలు పెరిగే అవకాశం ఉందని హర్యానా డీజీపీ కీలక వ్యాఖ్యలు చేసారు. అష్ట దిగ్బంధనం వల్ల నేరాలు తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. 

 

అష్ట దిగ్బంధనం పర్యవసానంగా ఏర్పడిన పరిస్థితులను పోలీసు ఉన్నతాధికారులతో తాను చర్చించా అని ఆయన వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ఈ ఆంక్షల ప్రభావం గురించి కూడా మాట్లాడా అని... ఈ ఆంక్షలను ఉపసంహరించినట్లయితే, నేరాలు పెరిగే అవకాశం ఉండటంతో, అటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉంచామని ఆయన అన్నారు. భవిష్యత్తులో నేరాలు పెరిగే అవకాశం ఉందని తాను భావించినట్టు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: