జమ్మూ కాశ్మీర్  లో ఉగ్రవాదులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. వారి గురించి ఎక్కడ ఏ సమాచారం అందినా సరే ఉపేక్షించడం లేదు. వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా విచారణ చేసి కీలక సమాచారం సేకరిస్తున్నారు. ఆపరేషన్ ఆల్ అవుట్ పేరుతో వారికి ఇప్పటికే భారీ దెబ్బ తగులుతుంది. 

 

ఇక కీలక ఉగ్రవాదులను కూడా బలగాలు అరెస్ట్ చేస్తున్నాయి. తాజాగా హిజ్బుల్ ముజాహిదీన్ కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను అధికారులు అరెస్ట్ చేసారు. వారి నుంచి ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు: ఈ విషయాన్ని హంద్వరా పోలీస్ అధికారులు వెల్లడించారు. కాగా నేడు ఉదయం పుల్వామా తరహాలో భారీ ఉగ్రవాద కుట్రను బలగాలు భగ్నం చేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: