మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న మిడతల దండు ఇప్పుడు తెలంగాణా వైపు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. తెలంగాణా వచ్చాయి అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చినట్టే. ఈ నేపధ్యంలో తెలంగాణా సర్కార్ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. మిడతల దండు ని అడ్డుకోవడానికి గానూ తెలంగాణా సర్కార్ అన్ని చర్యలను తీసుకుంటుంది. 

 

సిఎం కేసీఆర్ దీనిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మిడతల దండు పై ఆయన ఒక కమిటిని వేసారు. 5 మంది సభ్యుల కమిటి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాలని ఆయన సూచించారు. మనకు రావడానికి తక్కువ అవకాశాలు ఉన్నా సరే ఎప్పటికప్పుడు వాటిని గమనిస్తూ ఉండాలని ఆయన సూచనలు చేసారు అధికారులకు. అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: