భారత వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీన కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. మే 31 న ఆగ్నేయ, పక్కనే ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అందువల్ల సకాలంలో రుతుపవనాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఐఎండీ ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని ఐఎండీ పేర్కొంది. 
 
 
గురువారం నాటికి మాల్దీవులు-కమోరిన్ ప్రాంతం, సహా మిగతా అండమాన్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు ఐఎండీ తెలిపింది. అయితే నైరుతి రుతుపవనాలు ప్రవేశించే సమయంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నట్టు ఐఎండీ ప్రకటన చేసింది. అల్ప పీడనాలు ఏర్పడనుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని... వేటకు వెళ్లినా తిరిగి వచ్చేయాలని ఐఎండీ సూచించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: