దేశంలో ఏ దుర్ముహూర్తంలో కరోనా వైరస్ ప్రారంభమైందోకానీ ఎంత కట్టడి చేస్తున్నా.. లాక్ డౌన్ పాటిస్తున్నా కేసులు, మరణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ మద్య  భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 7,466 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 175 మంది మరణించారు.  ఇక రాష్ట్రాల విషయానికి వస్తే ఎక్కువగా కరోనా ప్రభావం ఉన్నది మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు. 

 

ఇక  మహారాష్ట్రలో అత్యధికంగా 59,546 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,982 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 19,372(మృతులు 148), ఢిల్లీలో 16,281(మృతులు 316), గుజరాత్‌లో 15,572(మృతులు 960), రాజస్థాన్‌లో 8,067(మృతులు 180), మధ్యప్రదేశ్‌లో 7,453(మృతులు 321), యూపీలో 7,170(మృతులు 197), పశ్చిమ బెంగాల్‌లో 4,536(మృతులు 295), ఏపీలో 3,245, బీహార్‌లో 3,185, కర్ణాటకలో 2,533, తెలంగాణలో 2,256 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: