ఇప్పుడు మహారాష్ట్ర సర్కార్ మిడతల దండుని ఎదుర్కోవడానికి నానా ఇబ్బందులు పడుతుంది. మహారాష్ట్రలో మిడతల దండు ఇప్పుడు నాగపూర్ సహా కొన్ని ప్రాంతాల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీనితో అక్కడ పురుగుల మందులను అధికారులు స్ప్రే చేస్తున్నారు. ఇక తెలంగాణా సర్కార్ కూడా వాటి విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. 

 

దీనిపై తెలంగాణా సిఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించి దక్షిణం వైపు గాలి వీచే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని కాబట్టి ఇటు వచ్చే సూచనలు చాలా తక్కువగా ఉన్నాయని అయినా సరే అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అక్కడి స్థానిక అధికారులు సొంతగా స్ప్రే చేస్తున్నారు. ఇవి మామిడి చెట్ల మీద ఎక్కువగా వాలాయి. దీనితో స్ప్రే చేసి వాటిని చంపాలని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: