ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘం అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కొనసాగించాలి అని ఏపీ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. ఆయన తొలగింపు ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన 13 పిటీషన్ లపై హైకోర్ట్ విచారణ జరిపింది. కొత్త ఎన్నికల కమీషనర్ నియామకం చెల్లదు అని, ఆయనను ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా కొనసాగించాలి అని స్పష్టం చేసింది. దీనిపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. 

 

హైకోర్ట్ రాజ్యాంగ విలువలను కాపాడింది అని ఆయన అన్నారు. హైకోర్ట్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ లో అప్పీల్ కి వెళ్ళదు అని భావిస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. హైకోర్ట్ ఇచ్చిన తీర్పులను ఏపీ సర్కార్ గౌరవించాలని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: