ఏపీ ప్ర‌భుత్వం మాజీ ఎన్నిక‌ల అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను తొల‌గిస్తూ తీసుకు వ‌చ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ఈసీ ర‌మేష్ కుమార్ స‌డెన్‌గా వాయిదా వేయ‌డం దీనిపై సీఎం హోదాలో ఉన్న జ‌గ‌న్ ప్రెస్‌మీట్ పెట్టి ర‌మేష్ కుమార్‌పై విమ‌ర్శలు చేయ‌డంతో పాటు ఆయ‌న్ను కులం పేరుతో ఆరోప‌ణ‌లు చేయ‌డం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ఈ రోజు తీర్పు ఇచ్చిన కోర్టు నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను తొల‌గించ‌డం స‌రికాద‌ని... ఆయ‌న స్తానంలో క‌న‌గ‌రాజ్‌ను ఎలా నియ‌మించార‌ని ప్ర‌శ్నించారు. ఇక వైసీపీ సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగానే ఈ మార్పు తీసుకు వ‌చ్చామ‌ని చెప్పినా కోర్టు సంతృప్తి చెంద‌లేదు.

 

ఇక ఆర్టిక‌ల్ 213 ప్ర‌కారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్ర‌భుత్వానికి  లేద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.  ఈ క్ర‌మంలోనే కోర్టు ఆయ‌న‌కు మ‌రో రెండేళ్ల పాటు అంటే ఆయ‌న ప‌ద‌వీ కాలం పూర్త‌య్యే వ‌ర‌కు ప‌ద‌విలో ఉండ‌వ‌చ్చ‌ని కూడా సూచించింది. దీనిని బ‌ట్టి చూస్తే జ‌గ‌న్‌కు మ‌రో రెండేళ్ల పాటు ర‌మేష్ కుమార్ తో క‌లిసి న‌డ‌వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఇక‌పై వార్ మ‌రింత ఆస‌క్తి కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: