ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన పాలన మీ సూచన సదస్సులో భాగంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ ఏడాది కాలంలో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని అన్నారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి క్యాన్సర్ ను, స్పీచ్ థెరపీని తెచ్చామని సీఎం అన్నారు. నెట్వర్క్ ఆస్పత్రులకు గ్రేడింగ్ ఇచ్చామని బి గ్రేడ్ లో ఉన్న ఆస్పత్రులు 6 నెలల్లో వసతులు మార్చుకోవాలని అన్నారు. 
 
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఆరోగ్య శ్రీ పథాకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. కరోనా ఇబ్బందులు ఉన్నా ఏ లోటు చేయకుండా ముందుకెళుతున్నామని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇచ్చే మందుల సంఖ్యను 230 నుంచి 500కు పెంచామని అన్నారు. నా మనస్సుకు నచ్చిన ప్రోగ్రామ్ వైయస్సార్ కంటి వెలుగు అని సీఎం అన్నారు. కంటివెలుగు దాదాపు 70 ల‌క్ష‌ల మంది పిల్ల‌ల‌కు కంటి పరీక్షలు చేశామని తెలిపారు. 4.70 ల‌క్ష‌ల బంది పిల్ల‌ల‌కు దృష్టిలోపాలు ఉన్నాయని... 1.58 ల‌క్ష‌ల పిల్లకు క‌ళ్ల‌జోళ్లు అవ‌స‌రం అని... 1.29 ల‌క్షల మందికి క‌ళ్ల‌జోళ్ల పంపిణీ జరిగిందని మిగిలిన వాళ్లకు స్కూళ్లు తెరిచిన వెంటనే పంపిణీ చేస్తామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: