ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైద్యం గురించి మన పాలన మీ సూచన సదస్సు నిర్వహించారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు తీసుకోవాలంటే భయపడేవారని... ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం అనుమతిచ్చిన మందులను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వైద్యం కోసం 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని అన్నారు. అంతర్జాతీయ ఆస్పత్రుల స్థాయిలో రాష్ట్రంలో ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నామని సీఎం జగన్ అన్నారు. 
 
రాబోయే రోజుల్లో 46,00 మంది విద్యార్థులకు శస్త్రచికిత్స చేయిస్తామని తెలిపారు. గతంలో సదర్ సర్టిఫికెట్ కోసం ఇబ్బందులు పడేవారని... ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నామని సీఎం జగన్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: