52 ప్రాంతీయ ఆస్పత్రుల అభివృద్దికి శ్రీకారం చుట్టామని సిఎం వైఎస్ జగన్ అన్నారు. వైద్యులు సూచించే మందులను డోర్ డెలివరి చేసే విధంగా చర్యలు చేపడతామని సిఎం అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. రు. 2600 కోట్లు ఖర్చుతో విలేజ్ క్లీనిక్‌లు, వార్డు క్లీనిక్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు. 

 

రెండు వేల జనాభాకు వైఎస్ఆర్ క్లీనిక్ ఉంటుందని జగన్ చెప్పారు. 24 గంటలు కూడా విలేజ్ క్లీనిక్ లో వైద్యం అందిస్తామని జగన్ చెప్పారు. కరోనా కట్టడికి యుద్ద ప్రాతిపదికన అడుగులు వేశామని అన్నారు. ప్రతీ ఒక్కరికి వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో 16 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: