ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మన పాలన మీ సూచన సదస్సులో మాట్లాడుతూ ఇప్పటివరకు 3,42,000 టెస్టులు రాష్ట్రంలో చేశామని... టెస్టుల పరంగా ఒక మిలియన్ జనాభాకు 6,627 టెస్టులు చేశామని రాష్ట్రాలలో హైయెస్ట్ టెస్టులు ఏపీలోనే జరిగాయని అన్నారు. దేశంలో పాజిటివ్ కేసుల రేటు 4.1 శాతం కాగా రాష్ట్రంలో 0. 95 శాతం అని అన్నారు. దేశంలో రికవరీ రేటు 42 శాతం కాగా రాష్ట్రంలో 65 శాతం అని అన్నారు. 
 
దేశంలో మరణాల రేటు 2.86 కాగా రాష్ట్రంలో మరణాల రేటు 1.82 శాతం అని చెప్పారు. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని... వారిని అంటరానివారిగా చూడవద్దని అన్నారు. కరోనాపై వార్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మొదటి స్థానంలో ఉందని చెప్పి లెక్కలతో జగన్ శభాష్ అనిపించుకున్నారు. కరోనా కట్టడికి యుద్ధప్రాతిదికన ఏర్పాట్లు చేశామని... రాష్ట్రంలో 13 ల్యాబ్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: