కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో చిరుత కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే తాజాగా మరోసారి రాజేంద్రనగర్‌లో చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది. నగరంలో చిరుత సంచరిస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ లో చిరుత సంచరించే దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. జాతీయ వ్యవసాయ పరిశోధనా విస్తరణ సంస్థ సమీపంలోని ట్యాంక్‌ ఏరియాలో ఓ సీసీటీవీలో చిరుత సంచరించడాన్ని అధికారులు గుర్తించారు. 
 
సీసీ కెమెరాలో చిరుతను చూసిన అధికారులు, సెక్యూరిటీ గార్డులు షాక్ కు గురయ్యారు. వంటేనే అటవీ అధికారులకు పులి గురించి సమాచారం ఇచ్చారు. అటవీ అధికారులు రంగంలోకి దిగి పులి కోసం గాలిస్తున్నారు. నిన్న రాత్రి 8.30 గంటల సమయంలో చిరుత అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో సంచరించినట్లు సమాచారం. చిరుత సంచరించినట్లు సీసీటీవీలో రికార్డ్‌ కావడంతో ఆయా సంస్థల అధికారులు అప్రమత్తమయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: