తెలంగాణ సీఎం కేసీఆర్ కొండ పోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి నీళ్లు చేరాయని సీఎం కేసీఆర్ చెప్పారు. నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. దేశంలో 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇవ్వడం తెలంగాణకు మాత్రమే సాధ్యమైందని ఇండియాలో ఆ రికార్డు తెలంగాణకు ఉందని అన్నారు. ఎవరైనా కాదంటారా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. 
 
భూ నిర్వాసితులకు సిద్దిపేట ఎస్‌ఈజడ్‌లో ఉద్యోగాలు ఇస్తామని... నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. తెలంగాణలో మల్లన్నసాగర్‌ రెండో అతిపెద్ద ప్రాజెక్టని... 53 లక్షల టన్నుల ధాన్యాన్ని కేంద్రానికి తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రం పసిడి పంటల తెలంగాణగా మారిందని... కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభకు నిదర్శనమని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: