తెలంగాణ సీఎం కేసీఆర్ కొండ పోచమ్మ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రాజెక్టును చూడాలని... అక్కడ నయాగరా జలపాతం లాంటి సీనరీ కనిపిస్తోందని... చూసి ఎంజాయ్ చేయండని కేసీఆర్ సూచించారు. రైతు బీమా, రైతు బంధు పథకాలు ఎక్కడా లేవని సీఎం అన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని... అద్భుతంగా ముందుకు వెళదామని అన్నారు. 
 
భూనిర్వాసితుల సహకారం వల్లే ప్రాజెక్టు పూర్తైందని అన్నారు భూ సేకరణలో రెవిన్యూ అధికారులు బాగా కష్టపడ్డారని అన్నారు. ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థలు ఎంతో కష్టపడి పని చేశాయని 530 టీఎంసీల నీళ్లను వాడుకునేలా ప్లానింగ్ చేశామని తెలిపారు. తెలంగాణ రైతాంగం ఆదర్శ రైతాంగం కావాలని సీఎం అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నీళ్లు అందజేస్తున్నామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: