మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్ట్ లో తగిలిన షాక్ పై ఇప్పుడు పలువురు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా బిజెపి ఎంపీ సిఎం రమేష్ తనదైన శైలిలో కామెంట్స్ చేసారు. ఏపీ సర్కార్ కి 50 కేసుల్లో చుక్కెదురు అయిందని ఆయన అన్నారు. 

 

ఏపీ సర్కార్ అయినా పద్ధతి మార్చుకోలేదు అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వానికి తొందరపాటు నిర్ణయాలు సరికాదని రమేష్ హితవు పలికారు. గవర్నర్ కార్యాలయం కూడా త్వరపడి ఆమోద ముద్ర వేసింది అని ఆయన పేర్కొన్నారు. హైకోర్ట్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం బిజెపి పిటీషన్ గెలిచింది అని ఆయన పేర్కొన్నారు. కాగా రమేష్ కుమార్ ని తొలగిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ ని ఏపీ హైకోర్ట్ కొట్టేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: