భారత సరిహద్దుల్లో ఉగ్రవాదులు ఈ మధ్య కాలంలో ఒక రేంజ్ లో చెలరేగుతున్న సంగతి తెలిసిందే. భారత్ పై కక్ష సాధింపు చర్యలకు పాకిస్తాన్ ఉగ్రవాదులను దింపుతుంది. దీనితో భారత బలగాలు కూడా ఎప్పటికప్పుడు దీటుగా సమాధానం ఇస్తూ వస్తున్నాయి. ఇక నిన్న పుల్వామా తరహాలో భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేయగా దానిని భారత ఆర్మీ అడ్డుకుంది. 

 

దీనిపై భారత ఆర్మీ విచారణ చేపట్టింది. భద్రతా బలగాలపై కాల్పులు జరిపిన ఉగ్రవాదిని కూడా గుర్తించారు. ఇక పుల్వామాలో పేలుడు పదార్థాలతో నిండిన కారు యజమాని హిదయతుల్లా మాలిక్ సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అతను కారు ఎవరికి అద్దెకు ఇచ్చాడు లేదా అతనే కారుని ఫ్రీ గా ఇచ్చాడా అనే దాని మీద ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: