దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా మహమ్మారి తో గందరగోళంగా ఉంది. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడులు మొదలయ్యాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు వరుస దాడులతో భారత సైనికుల సహనాన్ని పరీక్షిస్తున్నారు.  గత ఏడాది పుల్వామ దాడిలో భారత సైనికులు అమరులయ్యారు.. దానికి ప్రతిదాడిగా భారత సైన్యం ఉగ్రవాదుల స్థావరాలపై మూకుమ్మడి దాడులు చేసి గట్టిగానే బుద్ది చెప్పింది.  ఇదిలా ఉంటే అసలే ఉగ్రదాడులతో ఇబ్బందులు పడుతుంటే.. తాజాగా జమ్మూకశ్మీర్‌లో సిలిండర్లు తీసుకెళ్తున్న ట్రక్కులో పేలుడు సంభవించింది. సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కు జమ్మూ-శ్రీనగర్‌ హైవేపై ఆగి ఉంది.

 

అయితే ట్రక్కులో అకస్మాత్తుగా పేలుడు సంభవించి..పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.  అరగంట వ్యవధిలో డజనుకుపైగా సిలిండర్లు పేలిపోయారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకునే లోపే సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలాయి. ఘటనా స్థలం లో గందరగోళంగా ఉండటంతో   రహదారిపై రెండువైపులా వావాహ రాకపోకలు నిలిపేశాం. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఉధంపూర్‌ ఎస్‌ఎస్‌పీ రాజీవ్‌ పాండే తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: