డాక్టర్ సుధాకర్ వ్యవహారం ఇప్పుడు హైకోర్ట్ లో అడుగు పెట్టింది. ఆయన రిట్ పిటీషన్ దాఖలు చేయగా దానిపై హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్ కి మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వ తరుపు న్యాయవాది చెప్పారు. సుధాకర్ పోలీసు కష్టడీ లో ఉన్నారా లేక జ్యూడిషియల్ కష్టడీ లో ఉన్నారో చెప్పాలని జడ్జి ప్రశ్నించారు. 

 

సుధాకర్ ఆరోగ్య పరిస్థితి ఆడగా... రెండు రోజులు సమయం కావాలని అనగా సుధాకర్ కి ప్రాణ హాని ఉందని ఆయన తరుపు లాయర్ వాదించారు. దీనితో సుధాకర్ ప్రాణాలకు రెండు రోజుల్లో గ్యారెంటి ఏంటీ అని హైకోర్ట్ ప్రశ్నించింది. అవసరం అయితే జడ్జి ఇంటి నుంచే హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేయడానికి హైకోర్ట్ అనుమతి ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: