తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 72 గంటల్లో వాయిగుండం గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీని కారణంగా తెలంగాణాలో రేపు ఎల్లుండి భారీ వర్షాలు పలు చోట్ల పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. 

 

ఇక ఏపీలో కూడా పలు చోట్ల జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఇప్పటికే భారీ ఉష్ణోగ్రత లతో ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు ఎవరూ కూడా ఇప్పుడు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణాలోని దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఏపీలో కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పలు చోట్ల 45 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: