దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ 6000కు పైగా కేసులు నమోదవుతూ ఉండగా ప్రస్తుతం 7000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ ప్రముఖులను కూడా వదలడం లేదు. కరోనా భారీన పడి ప్రముఖ జ్యోతిష్కుడు బెజన్ దారువెల్లా మృతి చెందాడు. కొన్నిరోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయన గుజరాత్ లోని గాంధీనగర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. 
 
వారం రోజుల క్రితం ఆయనకు కరోనా నిర్ధారణ కాగా ఆయన ఇతర దీర్హ్గకాలిక వ్యాధులతో కూడా బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ ఆస్పత్రిలో వెంటిలెటర్ పై చికిత్స పొందిన బెజన్ ఈరోజు చికిత్సకు కోలుకోలేక మృతి చెందారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ ట్విట్టర్ ద్వారా బెజన్ దారువెల్లా మృతిని ధృవీకరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: