లాక్ డౌన్ కాలం లో చాలామంది ఆయా ప్రాంతాలకు వలసవచ్చి పని చేసుకుని బ్రతికే ఊరిలోనే చిక్కుకు పోయారు. అయితే లాక్ డౌన్ లో సరైన ఉపాధి లేక తిండికి గడవక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే వీరికోసం ప్రత్యేకంగా 200 రైళ్లను వారికికొసం ఏర్పాటు చేసింది. ఆ రైలులో వెళ్లే అవకాశం అందరికి దక్కడం లేదు . చాలా మంది  వారు తమ ఊర్లకు నడిచే వెళుతున్నారు.  అయితే వారి గురించి బాధపడుతూ వారిపై ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడంతో.

 

 

న్యాయమూర్తులు , న్యాయ వాదులు ఈ విషయమై సొంత రాష్ట్రాలకు నడిచి వెళ్లే వలస కార్మికుల గురించి వాస్తవ నివేదిక కోసం లాయర్‌ కె పవన్‌కుమార్‌ను అడ్వకేట్‌ కమిషన్‌గా నియమిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. అదేవిధంగా సంబంధిత జిల్లాల్లో వలస కార్మికుల వివరాలు సేకరించడానికి  కలెక్టర్ కి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడంతో పటు వారికీ 50 రూ. ఇంధన ఖర్చులు క్రింద ఇవ్వాలని ఈ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ విజరుసేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ప్రకటించింది.. కమిషన్‌, రంగారెడ్డి జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సెక్రెటరీని  తీసుకుని వలస కార్మికుల గురించి ఆరా తీసి జూన్1 నాటికి నివేదిక ఇవ్వాలని కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: