ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు మనుషుల ప్రాణాలు మాత్రమే కాదు.. ఆర్థిక వ్యవస్థను కూడా పూర్తిగా చిన్నా భిన్నం చేస్తుంది. ప్రపంచంలోకరోనా కేసులు 60 లక్షలు దాటాయి.  అమెరికాలో 17 లక్షలు దాటి 18 లక్షల దిశగా వెళ్తున్నాయి. అయితే అక్కడ తగ్గుముఖం పట్టింది కోరనా. 213 దేశాలకు కరోనా తీవ్రత ఉంది అనేది వాస్తవం. ఇప్పటివరకు 60  లక్షల 29 వేల 646 మందికి కరోనా సోకింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 30 లక్షల 3 వేల 738 గా ఉంది. 3 లక్షల 66 వేల 792 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.  ప్రస్తుతానికి కరోనా వైరస్ ని అరికట్టేందుకు వ్యాక్సిన్ లేదు.. జాగ్రత్తలు మాత్రమే తీసుకోవాలి అంటున్నారు.  ఈ నేపథ్యంలో ఇళ్లు, కార్యాలయాల్లో గాలి ప్రసరణ సరిగా లేకుంటే కరోనా వైరస్‌ను కొనితెచ్చుకున్నట్టేనని యూకేలోని సర్రే యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రశాంత్ కుమార్ తెలిపారు.

 

మనుషుల నిశ్వాస, తుమ్ము, దగ్గు ద్వారా బయటకు వచ్చే సూక్ష్మ బిందువుల్లో నుంచి నీరు క్రమంగా ఆవిరైపోతుందని, కానీ వైరస్ కణాలు మాత్రం అక్కడే ఉండిపోతాయని తమ అధ్యయనంలో తేలినట్టు పేర్కొన్నారు.  మనం ఉండే పరిసర ప్రాంతాల్లో ఎంత వీలైతే అంత వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. అన్ని గదుల్లోకి గాలి, వెలుతురు పూర్తిగా వచ్చేలా చూసుకోవాలని, లేకుంటే కరోనా ముప్పు తప్పదని హెచ్చరించారు. ప్రపంచాన్ని కోవిడ్ భయపెడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఈ విషయంపై తక్షణం దృష్టి సారించాలని సూచించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ఎన్విరాన్‌మెంట్ ఇంటరాక్షన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: