తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ మద్య కాస్త విరామం తీసుకుంటున్న విషయం తెలిసిందే.  తన శిష్యులకు తీస్తున్న చిత్రాలను పర్యవేక్షిస్తున్నారు.  అయితే చాలా కాలం తర్వాత ఆయన రెడీ షాట్.. స్టార్ట్.. అనబోతున్నట్లు సమాచారం. ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు దర్శకులతో తాను ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ఆయన గతేడాది ప్రకటించారు. అయితే, ఆ తర్వాత దాని గురించి మళ్లీ అప్ డేట్ ఏమీ లేదు. దాంతో ఈ చిత్రాన్ని ఆయన డ్రాప్ చేసుకుని ఉంటారని అంతా భావించారు. ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. వచ్చే నెల నుంచి షూటింగ్స్ చేసుకోవొచ్చు అని ప్రభుత్వం చెప్పింది.. ఈ నేపథ్యంలో దర్శకులు రెడీ అవుతున్నారు. 

 

గత ఏడాది ప్రకటించినట్టు త్వరలో చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. త్వరలోనే ఈ  చిత్రం గురించిన వివరాలు చెబుతానన్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని యంగ్ హీరో నాగశౌర్య దక్కించుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదే వాస్తవమైతే కనుక, నాగశౌర్య కెరీర్ ఊపందుకుంటుందని చెప్పచ్చు. ఛలో చిత్రంలో మంచి హిట్ అందుకున్న నాగశౌర్యకు తెలుగు లో మంచి క్రేజ్ ఉంది.. అలాంటిది మరి దర్శకేంద్రుడి చేతిలో పడితే ఆ చిత్రం హిట్ అయితే మనోడికి మంచి భవిష్యత్తే అంటున్నారు అభిమానులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: